సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏఎన్‌ఆర్‌ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్ల ప్రతిభ : కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరంలో ఆల్ రౌండ్ ప్రదర్శన

2 గంటల క్రితం

ఏఎన్‌ఆర్‌ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్ల ప్రతిభ
కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరంలో ఆల్ రౌండ్ ప్రదర్శన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 07:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుడివాడ

స్థానిక అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్‌) కళాశాలకు చెందిన ఐదుగురు ఎన్‌సీసీ క్యాడేట్లు ఆల్ ఇండియా ట్రెక్కింగ్ క్యాంప్, కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరాల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జె.ఎస్.కుమార్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన ఆల్ ఇండియా ట్రెక్కింగ్ క్యాంపులో క్యాడెట్లు ఎన్. లక్ష్మి ప్రసన్న, పి. శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కొండవీడు ఫోర్టు, కొండపల్లి ఫోర్టు, కోటప్పకొండ, మంగళగిరి ఎకో పార్కులను సందర్శించడంతో పాటు పర్వతారోహణపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అలాగే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరిగిన కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరంలో క్యాడెట్లు ఎస్. రవి కిరణ్, ఆర్. రాజేష్ కుమార్, ఎస్.కె. నాగూర్ మీరావలి పాల్గొన్నారు. శిక్షణలో అసాధారణ ప్రతిభ చూపిన ఎస్. రవి కిరణ్‌కు 'అవుట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ అవార్డు' లభించింది. ఇదే ప్రాంగణంలో ఎన్‌సీసీ అధికారి లెఫ్ట్నెంట్ ఎం.డి. సలీంకు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రూపేష్ అవస్థి అభినందన జ్ఞాపికను అందజేశారు. శిక్షణ శిబిరాల్లో ప్రతిభ చాటిన క్యాడెట్లను, అధికారిని కళాశాల పాలక వర్గ ప్రెసిడెంట్ ఎల్.ఆర్.కె. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ బి.ఎస్.ఎస్. పద్మజ, ఇతర అధ్యాపకులు అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్