ప్రజాశక్తి-గన్నవరం
జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్ మీట్, వివిధ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో సెయింట్ జాన్స్ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ యేసు ప్రభాకరన్ మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు పాఠశాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ఛాంపియన్‌లుగా నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్న విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను పాఠశాల డైరెక్టర్ రెవరెండ్ బ్రదర్ బాలశౌరి, వైస్ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ బల్లా జోసెఫ్, రెవరెండ్ బ్రదర్ జిమ్మీ కురియకోస్, రెవరెండ్ బ్రదర్ జెర్మియా, ఇతర ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.








కామెంట్‌లు (0)