మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బందరు లో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన...

17 నవంబర్, 2026

బందరు లో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్‌

:

కొద్దిపాటి వర్షానికే జలమయమవుతున్న మచిలీపట్నం నగరంలో ముంపు సమస్యకు చెక్‌ పెట్టేందుకు డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడిక (సిల్ట్‌) తొలగింపు పనులను అధికారులు వేగవంతం చేశారు. నగరంలోని రేవతి సెంటర్‌, బస్టాండ్‌ సెంటర్‌, జిల్లా కోర్టు సెంటర్‌, లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు పెద్దఎత్తున నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రధాన రహదారులపై డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రణాళికలు రూపొందించారు. మున్సిపల్‌ ఎన్నికల అనంతరం మేయర్‌ అబ్దుల్‌ అబిదా, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హసీమ్‌ బేగ్‌ కౌన్సిలర్లతో కలిసి నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మున్సిపల్‌ అధికారులు ప్రతిరోజూ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ పనుల్లో మచిలీపట్నం నగరపాలక సంస్థ హెల్త్‌ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యం, 55వ డివిజన్‌ శానిటేషన్‌ మేస్త్రి బట్రాజు రామశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్