ప్రజాశక్తి-మొవ్వ
రెండవ రోజు గురువారం మొవ్వ మండలంలో 38 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు మొవ్వఎంపీడీవో డి సుహాసిని తెలిపారు. వీరిలో వేములమడ 3, కాజ 3, కోసూరులో 5, అయ్యంకి 2, చినముత్తేవి 1, పద్దరాయుడు తోట 1, కూచిపూడి 4, పెదపూడి 4, బార్లపూడి 3, పెదముత్తేవి 2, యద్దనపూడి 2, మొవ్వపాలెం 2, గూడపాడు 1, బట్ల పెనుమర్రు 2, ఆవురుపూడి ఒకరు నామినేషన్లను ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేసినట్లు ఆమె వివరించారు.
అలాగే మొవ్వ మండలంలో వార్డు సభ్యులుగా 128 మంది వార్డుసభ్యులకు నామినేషన్లు వేశారని ఆమె వివరించారు.








కామెంట్‌లు (0)