ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం అభ్యర్థులను గెలిపించండి

19 నవంబర్, 2026

ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం అభ్యర్థులను గెలిపించండి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుడివాడ

గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే సీపీఎం అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని పేదలకు ఇళ్ల పట్టాల సాధన, మురికివాడలు, దళితవాడల్లో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం, స్మశాన వాటికల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఎన్నో పోరాటాలు నిర్వహించిందని గుర్తుచేశారు. మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రజల గొంతుక వినిపించేందుకు 17వ వార్డు అభ్యర్థి బొంతు ధనలక్ష్మి, 33వ వార్డు అభ్యర్థి చంద్రగిరి లక్ష్మీ తిరుపతమ్మ, 46వ వార్డు అభ్యర్థి ఆర్‌సిపి రెడ్డిలను 'సుత్తి, కొడవలి, నక్షత్రం' గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు బలపరిచిన ప్రజా నాయకులకు ప్రజలు అండగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు పి.ప్రసాద్, సమీర్ బాషా, యలవర్తి కోటేశ్వరరావు, యేసయ్య, ఆసిన్ ఖాజు భాయ్, ఐద్వా పట్టణ కార్యదర్శి పి.రజిని, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సమరం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్