ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలించిన --- జిల్లా కలెక్టర్

19 నవంబర్, 2026

జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలించిన --- జిల్లా కలెక్టర్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా)

​కృష్ణా జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం (నవంబర్ 20వ తేదీ) జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులకు జిల్లా పరిషత్ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన సీటింగ్ ఏర్పాట్లతో పాటు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేటాయించిన సీటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ నిర్ణీత సమయానికి ప్రారంభమై, ఎలాంటి ఆలస్యం లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాణ స్వీకారం, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల కార్యక్రమానికి హాజరయ్యే జెడ్పీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు ముందస్తుగా సమాచారం అందించి, అందరూ సమయానికి సమావేశ మందిరానికి చేరుకునేలా చూడాలని జిల్లా పరిషత్ సీఈవో ఎం శ్రీహరికి సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్