ప్రజాశక్తి-గుడివాడ
స్థానిక అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జి.కిరణ్ దత్త, ఎస్.రోహిణి, ఎం.సంధ్యారాణి బృందం ప్రథమ బహుమతి సాధించగా; ఎం.భవ్య, టి.రమ్య, సిహెచ్.అఖిల దేవి ద్వితీయ బహుమతి; పి.అశ్విని కుమారి, షేక్ షర్మిల, జె.వి.మోహన కృష్ణ శ్రీ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జె.ఎస్. కుమార్, గ్రంథపాలకురాలు బి.ఎస్.ఎస్. పద్మజ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)