ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెదపారుపూడి ఎంపీపీగా పొనుగోటి మమత బాధ్యతల స్వీకరణ

19 నవంబర్, 2026

పెదపారుపూడి ఎంపీపీగా పొనుగోటి మమత బాధ్యతల స్వీకరణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెదపారుపూడి (గుడివాడ)

పెదపారుపూడి ఎంపీపీగా వెంట్రప్రగడ-1 ఎంపీటీసీ సభ్యురాలు పొనుగోటి మమత గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలకు గాను కూటమి (టీడీపీ) అభ్యర్థులు ఆరుగురు, వైసీపీ అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించారు. గురువారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో కూటమి తరపున పొనుగోటి మమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల రిటర్నింగ్ అధికారి బాణావతి రవి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ మండల అధ్యక్షుడు చలసాని రమేష్ చౌదరి, ఎంపీటీసీ సభ్యులు వీరపనేని పద్మశ్రీ, పులవర్తి నాగముని, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్