బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జులై 10న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా

2 గంటల క్రితం

cdpo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 12:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆదోని: అంగన్వాడీలకు నెలకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, స్కీం వర్కర్లందరికీ వేతనాలు పెంచాలని సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిడిపిఓ ఢిల్లీశ్వరి కి వినతి పత్రం ఇచ్చారు. అంగన్వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటమ్మ, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ గోపాల్, తిప్పన్న, అంగన్వాడి నాయకురాలు పద్మ మాట్లాడుతూ "ఎన్నికల ముందు అంగన్వాడీలకు కనీస వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడిచినా అమలు చేయకుండా కాలయాపన చేస్తోంది" అని మండిపడ్డారు. అంగన్వాడీలకు నెలకు రూ.26,000 కనీస వేతనం, ఆశ వర్కర్లు సహా అన్ని స్కీం వర్కర్లకు జీతాల పెంపు, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, పిఎఫ్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల కోర్కెలను తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జులై 10న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఎదుట జరిగే మహాధర్నాలో అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, స్కీం వర్కర్లంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్