- కార్డన్ సెర్చ్‌లో 51 బైకులు సీజ్.. గ్రామంలో విస్తృత తనిఖీలు
ప్రజాశక్తి - పెద్దకడబూరు : పెద్దకడబూరు మండలంలోని, ఎన్నికల వేళ అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దకడబూరు మండలంలోని హెచ్.మురవణి గ్రామంలో సీఐ బిఏ. మంజునాథ్, ఎస్ఐ ఈ. మారుతి, ఆధ్వర్యంలో గురువారం విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు బృందాలు గ్రామంలోని అనుమానిత ప్రాంతాల్లో ఇంటింటా, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి వాటి ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా గ్రామంలో పెద్దఎత్తున పోలీసులు తనిఖీలు చేపట్టడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సిబ్బంది. ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణానికి తోడ్పడాలని కోరారు.







కామెంట్‌లు (0)