- సర్పంచి బరిలో వడ్డేవాటి చిన్న
- టీడీపీ నేతల ఆశీస్సులతో ముందడుగు
ప్రజాశక్తి - పెద్దకడబూరు : మండల పరిధిలోని, తారాపురం గ్రామాభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తారాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వడ్డేవాటి చిన్న పోటీకి సిద్ధమయ్యారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత రెడ్డి, ఆశీస్సులు, ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నట్లు బుధవారం పేర్కొన్నారు.గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని చిన్న తెలిపారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. గ్రామంలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేస్తూ, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.సర్పంచి పదవి అనేది హోదా కోసం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. గ్రామంలోని పేదలు, రైతులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేస్తానన్నారు. ప్రజల అభిప్రాయాలకు విలువనిస్తూ, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తానని తెలిపారు."మాటలు కాదు.. చేతలు! పదవి కోసం కాదు.. ప్రజాసేవ కోసం!" అనే నినాదంతో తారాపురం గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వడ్డేవాటి చిన్న స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని కోరారు.







కామెంట్లు (0)