ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డబ్బులు పంపిణీ.. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ... వైసిపి భారీ నిరసన

1 గంట క్రితం

YSRCP stages a massive protest alleging the distribution of money and the casting of bogus votes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 02:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - డోన్ (కర్నూలు) : డోన్ లో అన్యాయం జరుగుతుందని, ఓటర్లకు డబ్బులను పంపిణీ చేస్తూ దొంగ ఓట్లను వేయిస్తున్నారంటూ ... మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు డోన్ పోలీస్ స్టేషన్ ముందు భారీ నిరసన చేపట్టారు. ఆందోళనకారులు మాట్లాడుతూ .... మునిసిపల్ ఎన్నికల్లో స్థానికేతరులతో టిడిపి వాళ్ళు దొంగ ఓట్లు వేయిస్తున్నారని, అయినప్పటికీ పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటరుకు 2 వేల రూపాయలు క్యూ లైన్ లో పంచుతున్నా అధికారులు చూసి కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. We want justis 'మాకు న్యాయం కావాలి ` అని పెద్దపెట్టున నినాదాలు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్