సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీటి ఎద్దడిపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సుడిగాలి పర్యటన

15 సెప్టెంబర్, 2026

markapuram -1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 03:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - గిద్దలూరు : పట్టణంలో తీవ్రంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని స్వయంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణంలోని కొంగలవీడు రోడ్డు, అర్బన్ కాలనీ, పాములపల్లె రోడ్డు, నల్లబండ బజార్, బుడగ జంగాల కాలనీ, నాయి బ్రాహ్మణ కాలనీల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడి తాగునీటి సరఫరా, బోర్ల పరిస్థితి తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. ఎండిపోయిన బోర్ పాయింట్ల వద్ద ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు తాగునీరు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, సమస్యలు ఉన్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది పట్టణ ప్రముఖులు, అధ్యక్షులు, కౌన్సిలర్ లు, వార్డు నాయకులు, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్