ప్రజాశక్తి-గిద్దలూరు: స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ పట్టణంలో దేశభక్తి ఉప్పొంగింది. భారత స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని అర్బన్ సీఐ కే. సురేష్ విద్యార్థులతో కలసి జాతీయ జెండా ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కే. సురేష్ మాట్లాడుతూ.. నేటి యువత, విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని, ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని, ఐక్యతను పెంపొందించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ ర్యాలీకి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించగా పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మహనీయుల త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 11:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)