శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డయాలసిస్ రోగులకు పెద్ద వాహనం సదుపాయం కల్పించాలి

1 గంట క్రితం

car.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు సిపిఎం విజ్ఞప్తి

ప్రజాశక్తి-విజయవాడ: ఏ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ రోగులు విజయవాడలోని ఆసుపత్రులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వారికి పెద్ద వాహనాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ కోరారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏ.కొండూరు మండలం నుంచి ప్రతిరోజూ డయాలసిస్ కోసం రోగులు, వారి సహాయకులు ప్రభుత్వ వాహనంలో విజయవాడకు వస్తున్నారని తెలిపారు. అయితే వాహనం చిన్నదిగా ఉండటంతో రోగులతో పాటు సహాయకులు ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రోగులను మాత్రమే పంపించి, సహాయకులను దించివేయాలని పీహెచ్‌సీ వైద్యులు సూచించినట్లు పేర్కొన్నారు. డయాలసిస్ అనంతరం రోగులకు సహాయకుల అవసరం ఎంతో ఉంటుందని డి.వి.కృష్ణ తెలిపారు. రక్తం ఎక్కించే సమయంలో, వాష్‌రూమ్‌కు తీసుకెళ్లడం, ఆహారం అందించడం తదితర అవసరాలకు సహాయకులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు. సహాయకులు లేకుండా రోగులను పంపడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అందువల్ల రోగులతో పాటు వారి సహాయకులు కూడా ప్రయాణించేలా పెద్ద ప్రభుత్వ వాహనాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్