శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేయనున్న రాష్ట్రపతి

1 గంట క్రితం

President to present awards to best teachers.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 12:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో తన నివాసంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రధాని మోడి శనివారం ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ... దేశవ్యాప్తంగా విశేష సేవలు అందించి జాతీయ పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఇదిలా ఉండగా ... నేడు దేశ వ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందచేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నేడు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మంచి పనితీరు కనపరిచిన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కో టీచర్‌కు అవార్డులు అందచేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంపికయిన ఉపాధ్యాయులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో .... ప్రతి అవార్డు గ్రహీతకు సంబంధించిన అద్భుతమైన కృషిని తెలియజేసే లఘు డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తారు.


ఉపాధ్యాయ దినోత్సవానికి ముందు రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఒక సందేశంలో ఆమె ఇలా పేర్కొన్నారు. "ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గొప్ప రచయిత, తత్వవేత్త అయిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయన ఒక అసాధారణ ఉపాధ్యాయుడు కూడా. ఈ సందర్భంగా ఆయనకు నా వినయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. " ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం, సలహాల ద్వారా ప్రతిభను పెంపొందించడంలోనూ, వ్యక్తిత్వాన్ని బలోపేతం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులను మంచి మనుషులుగా తీర్చిదిద్దడం వారి కర్తవ్యం అని ఆమె చెప్పారు. అంకితభావం, శ్రద్ధ కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులలోని విశిష్ట సామర్థ్యాన్ని గుర్తించి, వారికి స్ఫూర్తిగా నిలుస్తూ, ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేసేలా ప్రోత్సహించగలరని ఆమె తెలిపారు. ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవాలని, సాంకేతికతను స్వీకరించాలని, వినూత్న బోధనా పద్ధతులను అవలంబించాలని రాష్ట్రపతి కోరారు. వారు విద్యార్థులలో స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహించి, పరిశోధనా స్ఫూర్తిని పెంపొందించాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్