ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లోనే కూటమి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

04 ఆగస్టు, 2026

ntr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 04:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ డిమాండ్

ప్రజాశక్తి - విస్నన్నపేట : విస్నన్న పేట మండలంలోని స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం విస్సన్నపేట టౌన్ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం అధ్యక్షతన మంగళవారం జగనన్న కాలనీ స్థలాల లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అర్హులైన పేదలకు ప్రభుత్వం సెంటున్నర స్థలం కేటాయించిందని, కానీ తిరువూరులో ఎక్కడ జగనన్న కాలనీ పేరుతో ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించలేదని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 99 పైసలు ఎకరం భూమి పెట్టుబడిదారులకు 99 సంవత్సరాల లీజుకి ఇచ్చిందని, అలాంటప్పుడు పేదలకు సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టి ఇవ్వటానికి ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. అంటే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఓట్లు పొంది పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా వెంటనే పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, కాలనీలో కనీస మౌనిక వసతులైన వీధిలైట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాలనీ ఇల్లు నిర్మించి ఇచ్చేంతవరకు సిపిఎం లబ్ధిదారుల పక్షాన పోరాడుతుందని విస్సన్నపేట సిపిఎం మండల కార్యదర్శి వి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విస్సన్నపేట మండలం కమిటీ సభ్యులు వినుకొండ రంగా రాణి ఆడిమిల్లి కిషోర్ గద్దల రామకృష్ణ లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్