ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు

6 రోజుల క్రితం

కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి డోనాడి రమేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు ఎస్‌. సవిత, వి. అనిత, జి. సంధ్యారాణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేయగా, దేవస్థానం చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్‌ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మంత్రులు మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్