- ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
ప్రజాశక్తి - జగ్గంపేట : సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలని, తామే కూటమి అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకునే వారిని ప్రజలు నమ్మవద్దని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని ఖండిస్తున్నామన్నారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీలు ఉమ్మడిగా ఎలాంటి అభ్యర్థులను ప్రకటించలేదని, కొన్ని గ్రామాల్లో కేవలం టిడిపి తరఫున మాత్రమే అభ్యర్థులను ప్రకటించామని వివరించారు. గోకవరంలో టిడిపి తరఫున గాజింగం సత్తిబాబు సతీమణిని మాత్రమే అధికారిక అభ్యర్థిగా ప్రకటించామని తెలిపారు. అక్కడ కొందరు తామే కూటమి అభ్యర్థులమంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మవద్దని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎస్.వి.ఎస్. అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)