ప్రజాశక్తి-నందిగామ: నందిగామ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే వీధి దీపాలు వెలగకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మున్సిపల్ కార్యాలయం ఉన్న ప్రధాన రహదారిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, రైతుబజార్ వద్ద గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో సాయంత్రం వేళల్లో ఆ ప్రాంతమంతా చీకటిమయంగా మారుతోంది. అటుగా రాకపోకలు సాగించే స్థానికులు, ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే వీధి దీపాలు వెలగకపోతే పట్టణంలోని ఇతర వార్డుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లోనే వీధి దీపాల నిర్వహణ ఇంత అధ్వానంగా ఉంటే, అంతర్గత వార్డుల సమస్యలను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మున్సిపల్ కార్యాలయం పరిసరాలతోపాటు అదే మార్గంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, రైతుబజార్ వద్ద వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేయించాలని లేదా అవసరమైన చోట కొత్త దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.








కామెంట్‌లు (0)