ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

'మధ్యవర్తిత్వం-దేశం కోసం' న్యాయవాదుల పాదయాత్ర

07 ఆగస్టు, 2026

'Mediation for the Nation' – Lawyers' Padayatra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 01:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండే కేసులను, వివాదాలను ఇరుపక్షాల అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా విజయవాడలో న్యాయమూర్తులు, న్యాయవాదులు 1కె పాదయాత్ర నిర్వహించారు. బెజవాడ బార్ అసోసియేషన్, జిల్లా చట్టపరమైన సేవల అధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం 'మధ్యవర్తిత్వం-దేశం కోసం' అనే ముఖ్య నినాదంతో ఈ 1కే పాదయాత్ర విజయవంతంగా సాగింది. విజయవాడ కోర్టుల సముదాయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర, అక్కడి నుంచి మ్యూజియం రోడ్డు మీదుగా బందర్ రోడ్డు, అంబేద్కర్ విగ్రహం, పోలీస్ కమిషనర్ కార్యాలయం మీదుగా సాగుతూ తిరిగి కోర్టుల సముదాయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణుబట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ .... ప్రజల్లో మధ్యవర్తిత్వంపై విస్తృత అవగాహన కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో నెల రోజుల పాటు ప్రత్యేక మధ్యవర్తిత్వం సెల్ నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎం. సునీల్ కుమార్, సిబిఐ జడ్జి ఎస్. రామకృష్ణ, 3వ అదనపు జిల్లా జడ్జి ఎల్. తేజవతి, ఎంపిఎంఎల్ఎ కోర్ట్ జడ్జి తిరుమలరావు, 6వ సబ్ కోర్ట్ జడ్జి (సీనియర్ డివిజన్) సాయిరాం, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి.జి. కిరణ్, అలాగే పెద్ద సంఖ్యలో జూనియర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్