ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చోరీ కేసును ఛేదించిన పోలీసులు - అంతర్రాష్ట్ర ఘరానా దొంగ అరెస్ట్

1 రోజు క్రితం

Police crack theft case Inter state notorious thief arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 02:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇబ్రహీంపట్నం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

  • అంతర్రాష్ట్ర ఘరానా దొంగ అరెస్ట్

  • రూ.92 లక్షల బంగారం, రూ.9.50 లక్షల నగదు స్వాధీనం

  • వివరాలు వెల్లడించిన సీపీ ఎస్‌వి రాజశేఖర్‌ బాబు

ప్రజాశక్తి-ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుంటుపల్లిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 10 రోజుల్లోనే ఛేదించారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగ పోలాకి అప్పలనాయుడు (47)ను అరెస్ట్‌ చేసి, రూ.92 లక్షల విలువైన 654 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.9.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌ బాబు ఈ వివరాలు వెల్లడించారు.

01


ఈ నెల 15న రాత్రి గుంటుపల్లిలోని ఒక ఇంట్లో బాధితులు నిద్రిస్తుండగా, కిటికీ గుండా చేయి పెట్టి గడియ తీసిన నిందితుడు బీరువాలోని 764 గ్రాముల బంగారాన్ని అపహరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పశ్చిమ జోన్‌ డీసీపీ జి.రామకృష్ణ పర్యవేక్షణలో, ఏసీపీ దుర్గారావు ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్‌, ఎం.వి.దుర్గారావు బృందాలు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టాయి. వన్‌టౌన్‌ పరిధిలోని వినాయకుడి గుడి వద్ద బంగారం విక్రయించి నగదుతో వస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలానికి చెందిన అప్పలనాయుడు 1999 నుంచి తెలంగాణ, ఏపీలో ఇప్పటివరకు 94 చోరీలకు పాల్పడ్డాడు. 2019లో పీడీ యాక్ట్‌ కింద జైలుకు వెళ్లి, 2024లో మక్తల్‌ కేసులో విడుదలయ్యాడు. రెండు వారాల క్రితం విజయవాడ వచ్చి మాస్క్‌, టోపీ ధరించి రెక్కీ నిర్వహించి 95వ చోరీకి పాల్పడి పట్టుబడ్డాడని సీపీ వివరించారు. నగరంలో చోరీల శాతం గణనీయంగా తగ్గిందని, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ నగదు ప్రోత్సాహకాలు అందించి అభినందించారు.
02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్