బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జర్నలిస్టులపై దాడులకు నిరసనగా ... తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

1 గంట క్రితం

Protest against attacks on journalists... Dharna in front of the Tehsildar's office
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 11:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రెడ్డిగూడెం (ఎన్టిఆర్) : ఢిల్లీ లో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేయడానికి నిరసనగా .... ఎపిడబ్లుజెఎఫ్, ఎపిబిజెఎ ఆధ్వర్యంలో రెడ్డిగూడెం పాత్రికేయులు స్ధానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ... సమాజ శ్రేయస్సు కోసం, రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం పాత్రికేయులు నిరంతరం శ్రమిస్తున్నారనీ, అలాంటి వారు విధుల్లో ఉండగా పోలీసులు దాడులు చేయటం రాజ్యాంగంపై దాడిలాంటిదేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతూ ... స్ధానిక తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు, సిహెచ్ విజయకుమార్, రవి, బాలు, సుబ్బారావు, బి, ప్రసాద్, ప్రవీణ్, కె శ్రీనివాసరావు, వంశీ, ఎం ప్రసాదరావు, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్