నందిగామ (ఎన్టిఆర్) : నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ నుండి రామన్నపేట వెళ్లే రహదారి పూర్తిగా ఆధునికరించి తారు రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నందిగామ ఆర్డీవో అనిల్ కు వినతిపత్రం అందచేశారు. రామన్నపేట రహదారి పూర్తిగా గుంటలపూడి వాహనదారులు వెళ్లడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. నడకదారులు గుంటల్లో నడవలేక కిందపడి పోతున్నారు. ఈ రహదారి పూర్తిగా గతుకులమయం కావడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది తక్షణమే రామన్నపేట రహదారి పూర్తిగా తారు రోడ్డు వేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి గోపాల్ సిపిఎం నాయకులు హుస్సేన్ గోపి నాయక్ పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రామన్నపేట రహదారి పూర్తిగా విస్తరించాలి : సిపిఎం
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 12:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)