గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈదురు గాలులకు విద్యుత్ వైర్లపై పడిన భారీ వృక్షం

1 గంట క్రితం

aalamuru-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని మడికి 216ఏ జాతీయ రహదారి నుండి దుళ్ల వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు ప్రక్కనగల భారీ వృక్షాలు ఈదురుగాలులకు విద్యుత్ హై టెన్షన్ వైర్లు పై పడటంతో హై టెన్షన్ వైర్లతో పాటు స్తంభం కూడా నేలకొరిగింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాత్రి కావడం, ఆ సమయంలో విద్యుత్ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా విద్యుత్ శాఖ సిబ్బంది నేలకొరిగిన భారీ వృక్షాన్ని యుద్ధ ప్రాతిపదికపై కోత యంత్రాలతో తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ భారీ వృక్షాలను తొలగించాలంటూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో కొబ్బరి చెట్టు హై టెన్షన్ వైర్లపై పడి నేలకొరకడాన్ని గమనించిన ఇద్దరు యువకులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటకాలువకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్