శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంబాపురంలో ఉద్రిక్తత

1 రోజు క్రితం

• రీకౌంటింగ్‌ నిర్వహించాలని మహిళల ఆందోళన
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

• రీకౌంటింగ్‌ నిర్వహించాలని మహిళల ఆందోళన

• సర్పంచి ఎన్నిక ఫలితంపై అనుమానాలు

ప్రజాశక్తి - అంబాపురం : అంబాపురం గ్రామంలో రీకౌంటింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇండిపెండెంట్‌ అభ్యర్థి తోడేటి శ్రీలతకు చెందిన కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమ అభ్యర్థి తరఫున తొమ్మిది మంది మండల వార్డు సభ్యులు గెలుపొందినప్పటికీ, సర్పంచిగా కూటమి అభ్యర్థి అరుణ 16 ఓట్ల మెజారిటితో గెలుపొందడంపై వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సర్పంచి ఎన్నికకు సంబంధించిన ఓట్లను మరోసారి లెక్కించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్