శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎమ్మెల్సీ ఎన్నికలలో అర్హులైన ఓటర్ ను మాత్రమే నమోదు చేయండి-- యుటిఎఫ్

26 అక్టోబర్, 2026

ఎమ్మెల్సీ ఎన్నికలలో అర్హులైన ఓటర్ ను   మాత్రమే నమోదు చేయండి-- యుటిఎఫ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 06:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – విస్సన్నపేట:

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఉపాధ్యాయులనే ఓటర్లుగా నమోదు చేయాలని యుటిఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు విస్సన్నపేట మండల విద్యాశాఖాధికారికి (ఎంఈఓ) వినతిపత్రం సమర్పించారు. అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు, అర్హత లేని వ్యక్తులు ఉపాధ్యాయ ఓటర్ల జాబితాలో చేరకుండా కట్టుదిట్టమైన పరిశీలన, ధ్రువీకరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు అర్హులైన ఓటర్ల నమోదు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల ఓటరు నమోదు ఫారం-19పై జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కౌంటర్ సంతకం చేయడానికి ముందు మండల విద్యాశాఖాధికారులు సంబంధిత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే అర్హులైన ఉపాధ్యాయుల ఓటు నమోదు సమయంలో యాజమాన్యం ఇచ్చే సర్వీస్ సర్టిఫికెట్‌ను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా, ఇతర అవసరమైన అర్హతలు, ధ్రువపత్రాలను కూడా పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ చంటిబాబు, ఎ. మురళీకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. రామకృష్ణారెడ్డి, కె. రంగ రాజేంద్ర, బి. వెంకటేశ్వరరావు, కెవి అన్నపూర్ణ, ముత్యాల రాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్