ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెయిట్‌, పవర్ లిఫ్టింగ్‌లో ఎల్‌‌బిఆర్‌సిఇ విద్యార్థుల ప్రతిభ

5 రోజుల క్రితం

ఎల్ బి ఆర్ సి ఈ విద్యార్థుల ప్రతిభ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మైలవరం

జెఎన్‌‌టియుకె సెంట్రల్ జోన్ ఇంటర్ కాలేజియేట్ వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల (ఎల్‌బీఆర్‌సీఈ) విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అప్పారావు మంగళవారం తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో గుడ్లవల్లేరులో జరిగిన ఈ పోటీలు, సెలక్షన్స్‌లో తమ కళాశాల విద్యార్థులు 4 బంగారు, 6 వెండి, ఒక కాంస్య పతకం సాధించారని పేర్కొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు కోచ్ బి.నటరాజ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ రాజ్‌కుమార్‌లను కళాశాల ప్రెసిడెంట్ జి.శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్