ప్రజాశక్తి - నందిగామ
నందిగామ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్స్ విభాగంలో పి. అభిలాష్, కె. చేతన్ కుమార్, ఎస్‌కె. సోహెల్ బృందం ప్రథమ స్థానం సాధించగా, పి. సాత్విక, ఓ. శశిధర్, ఎస్‌కె. సుఫీ నోల్ బృందం ద్వితీయ స్థానంలో నిలిచింది. జూనియర్స్ విభాగంలో ప్రియదర్శిని, యు. ప్రహర్ష, కె. కుందనిక బృందం ప్రథమ స్థానం, పి. కార్తీక్, ఓ. సుహృత్, జి. ఇందుశ్రీ బృందం ద్వితీయ స్థానం సాధించాయి. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి అల్లూరు రామచంద్రుడు పాల్గొనగా, గోపి, గోపాలకృష్ణ, రాజేష్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.







కామెంట్‌లు (0)