ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.......

5 రోజుల క్రితం

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తిరువూరు

గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా తిరువూరు గ్రేడ్‌-1 శాఖా గ్రంథాలయంలో మంగళవారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సబ్‌ జూనియర్స్‌ విభాగంలో పరిశుభ్రత – మన బాధ్యత, జూనియర్స్‌ విభాగంలో ప్లాస్టిక్‌ రహిత సమాజం, సీనియర్స్‌ విభాగంలో ‘అభివృద్ధి చెందిన భారతదేశం – 2047’ అనే అంశాలపై పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఆయా అంశాలపై తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచారు. ఈకార్యక్రమంలో తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షులు, విశ్రాంత ఉపాధ్యాయులు టి. ఉమామహేశ్వరరావు, వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ నిర్వాహకులు ఎస్. నాగేశ్వరరావు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్