ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు: ఎమ్మెల్యే బోండా ఉమ

5 రోజుల క్రితం

ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు: ఎమ్మెల్యే బోండా ఉమ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న విజయవాడ స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ స్మృతి వనంలో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం అజిత్‌సింగ్ నగర్‌లోని తన కార్యాలయంలో ఈ వేడుకల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. విద్యార్థుల్లో అవగాహన కోసం వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు 26న బహుమతులు అందజేస్తామని చెప్పారు. వేడుకల్లో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఘంటా కృష్ణమోహన్, నిర్వాహకులు బెజ్జం జయపాల్, మద్దాల చక్రవర్తి, పరీశపోగు రాజేష్, వేల్పుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్