ప్రజాశక్తి - నందిగామ
నందిగామ పట్టణంలో రేషన్ దుకాణాల నుంచి పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 26 కిలోల ప్లాస్టిక్ సంచుల్లో బియ్యాన్ని నింపి స్కూటీలపై రవాణా చేస్తున్నారు. స్కూటీపై బియ్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయకుండా, వారికి నగదు చెల్లించి బియ్యాన్ని సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా సేకరించిన బియ్యాన్ని ఒకచోట నిల్వ చేసి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. స్కూటీలపై తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








కామెంట్‌లు (0)