బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ... 12 గంటల వ్యక్తిగత ఆందోళన

4 రోజుల క్రితం

12-hour personal protest against the NEET paper leak.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా .... పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన షేక్ సుభాని శనివారం వినూత్న రీతిలో వ్యక్తిగత ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ నరసరావుపేట గడియార స్తంభం సెంటర్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండాను చేతబట్టి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు నిరసనలో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా షేక్ సుభాని మాట్లాడుతూ .... నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర, పారదర్శక దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పరీక్షలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ వ్యక్తిగత నిరసన స్థానిక ప్రజల దృష్టిని ఆకర్షించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్