ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘తిరుమల’లో సెంట్రల్ జోన్ మహిళల వాలీబాల్ పోటీలు

13 నవంబర్, 2026

‘తిరుమల’లో సెంట్రల్ జోన్ మహిళల వాలీబాల్ పోటీలు
25 కళాశాలల నుంచి 300 మంది క్రీడాకారిణుల హాజరు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 25 కళాశాలల నుంచి 300 మంది క్రీడాకారిణుల హాజరు

ప్రజాశక్తి - నరసరావుపేట: నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో జెఎన్‌‌టియు సెంట్రల్ జోన్ అంతర్ కళాశాలల మహిళల వాలీబాల్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండ్రోజులపాటు జరిగే ఈ టోర్నీలో యూనివర్సిటీ జట్టు ఎంపిక పోటీలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రావెల సత్యనారాయణ ప్రారంభించారు. జెఎన్‌‌టియు సెంట్రల్ జోన్ పరిధిలోని 25 కళాశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థినులు హాజరవగా నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ‌డాక్టర్‌ ‌వైవి నారాయణ, టోర్నమెంట్ సెక్రటరీ, పరిశీలకులు జి.పి.రాజు, యూనివర్సిటీ జట్టు ఎంపిక కమిటీ సభ్యులు జి.లోహిత, కృష్ణప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.హనుమంతరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రావెల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని అలవర్చుతాయన్నాaరు.తమ కళాశాలలో యూనివర్సిటీ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడంసంతోషంగా ఉందన్నారు. కళాశాల ఫౌండర్ ప్రిన్సిపాల్ డాక్టర్ వైవి నారాయణ మాట్లాడుతూ గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులు ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ సెక్రటరీ, పరిశీలకుడు జి.పి రాజు, యూనివర్సిటీ జట్టు ఎంపిక కమిటీ సభ్యులు జి.లోహిత, కృష్ణప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.హనుమంతరావు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్