సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్‌ మరమ్మత్తులు చేస్తుండగా షాక్‌తో జెఎల్‌ఎం మృతి

1 గంట క్రితం

line man
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 10:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎడ్జ్‌ ఫ్యూజ్‌ సేకరణ పనులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై జూనియర్‌ లైన్‌మెన్‌ (జెఎల్‌ఎం) పి.వెంకటేష్‌ మృతి చెందాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు రొంపిచర్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పి. వెంకటేష్‌గా గుర్తించారు. విధుల్లో భాగంగా పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎడ్జ్‌ ఫ్యూజ్‌ సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న విద్యుత్‌ శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్