తొలి చైర్మన్‌గా పుచ్చకాయల రమాదేవి...వైస్ చైర్మన్ గా నల్లపాటి కీర్తన...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా పరిషత్ లో కీలక పదవులు నరసరావుపేటకు దక్కాయి. పల్నాడు జిల్లా పరిషత్ తొలి చైర్మన్ గా పుచ్చకాయల రమాదేవి బసవేశ్వరరావు, వైస్ చైర్మన్ గా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కుమార్తె నల్లపాటి కీర్తన బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా పరిషత్ లో ఈ రెండు కీలక పదవులు నరసరావుపేటకు దక్కడంతో జిల్లా రాజకీయాల్లో పట్టణానికి ప్రత్యేక గుర్తింపు లభించినట్లయింది. పల్నాడు జిల్లా పరిషత్ పాలకవర్గంలో నరసరావుపేటకు ప్రాధాన్యత లభించడం వెనుక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కీలకంగా వ్యవహరించారు.







కామెంట్‌లు (0)