సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రొంపిచర్లలో ఉద్రిక్తత - లాఠీచార్జ్

21 అక్టోబర్, 2026

Tension in Rompicherla - Lathi-charge
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వైసీపీ శ్రేణులు... పోలీసుల మధ్య వాగ్వాదం...

  • లాఠీ చార్జ్‌ చేసిన పోలీసులు... పోలీసుల తీరుపై గోపిరెడ్డి ఆగ్రహం...


ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మండల కేంద్రం రొంపిచర్లలో ఎంపీటీసీ నామినేషన్‌ సందర్భంగా బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా 300 మందికి పైగా కార్యకర్తలతో కలిసి వచ్చిన వైసిపి పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి పోలీసులు అడ్డంకులు కల్పించడంతో వైసిపి శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల చర్యతో ఆగ్రహం వ్యక్తం చేసిన గోపిరెడ్డి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ కార్యకర్తలు ‘వి వాంట్‌ జస్టిస్‌’ అంటూ నినాదాలు చేశారు. లాఠీ చార్జ్‌ ఘటనతో రొంపిచర్లలో ఒక్కసారిగా హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ఘటనతో నామినేషన్‌ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్