ప్రజాశక్తి – పల్నాడు జిల్లా: విజయదశమి సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి దంపతులు ఆయుధ పూజ, శ్రీ కనకదుర్గ అమ్మవారి పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోలీసు ఆయుధాలు, వాహనాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజుగా విజయదశమిని జరుపుకుంటారని తెలిపారు. పాండవులు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన సందర్భాలను పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారని వివరించారు. చెడు ఎంత బలంగా ఉన్నా అంతిమంగా మంచే విజయం సాధిస్తుందనే సందేశాన్ని విజయదశమి అందిస్తుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరితో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ
21 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026, 02:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)