పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి ‘స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం’ విభాగంలో అవార్డు లభించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నరసరావుపేట పట్టణం ప్రకాష్ నగర్లోని భువనచంద్ర టౌన్హాలులో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు నుండి పురస్కారాన్ని అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి స్వీకరించి మాట్లాడారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని అన్నారు. ప్రతి ఇల్లు, కార్యాలయం, గ్రామం, పట్టణం నుంచి పరిశుభ్రత కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడే రాష్ట్రాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ అద్దయ్య, ఆర్డీఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బి.రమ్య కీర్తన, డీపీఓ నాగేశ్వర నాయక్ పాల్గొన్నారు.









కామెంట్లు (0)