ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓట్లు మాయం చేసిన సిఈసి ని తక్షణమే తొలిగించాలి

02 అక్టోబర్, 2026

బీజేపీ చేతిలో బంటు జ్ఞానేష్ కుమార్ 
ఓట్లు మాయం చేసిన సిఈసి ని తక్షణమే తొలిగించాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 06:05 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రజాశక్తి సత్తెనపల్లి టౌన్ :

ప్రజల ఓట్లకు భద్రత కల్పించటమే కాక ఆర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాల్సిన దేశ ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ చేతిలో పావుగా మరి దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలిగించిన సిఈసి ని తలక్షణమే తొలిగించాలని సీపిఎం పార్టి సీనియర్ నాయకులు గద్దె చలమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . శుక్రవారం ఆయన పట్టణ సీపిఎం పార్టి ఆధ్వర్యంలో సిఈసి జ్ఞానేష్ కుమార్ని తొలిగించాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు , ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక జాతీయ నాయకుల విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు . సభకు సీపిఎం పార్టి పట్టణ కార్యదర్శి ధరణికోట విమల అధ్యక్షత వహించారు . అనంతరం చలమయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ. నేడు మాహాత్మా గాంధీజీ పుట్టినరోజు స్వాతంత్రం కోసం ఉద్యమించి స్వాతంత్రాన్ని సాధించిన గాంధీని ఆర్ ఎస్ ఎస్ సంఘ నాయకుడు నాధురామ్ గాడ్సే అత్యంత పాశావికంగా హత్య చేశాడు . అటువంటి గాడ్సేని కొనియాడే పార్టి బీజేపీ అంటూ విమర్శలు చేశారు . భారత రాజ్యాంగం ప్రజలకు ఓటు అనే హక్కును అందించింది . ప్రజలు తమ ఓటు ద్వారా తమ అభివృద్ధికి ఎవరూ పాటుపడతారో వారిని ఎన్నుకొని ఓటు అనే అస్త్రాన్ని అందించింది అన్నారు . అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశంలో ఆర్ ఎస్ ఎస్ రాజ్యాన్ని స్థాపించాలానే లక్ష్యంతో నిజాయితీగా ప్రజల మన్ననలు పొందలేము అని భావించి రాజ్యాంగ సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొని తన సామ్రారాజ్యాన్ని స్థాపించే కుట్రలుమొదలు పెట్టారు .


ఇప్పటికే గడచిన అయిదు రాష్టాల ఎన్నికల్లో ఊహించనివిధంగా అధికారాన్ని కైవసం చేసుకున్నారు అంటూ ఆరోపణలు చేశారు . అందులో భాగంగా భారత ఎన్నికల టీంలో ఒక ముగ్గురు ఉంటే మిగతా ఇద్దర కమీషనర్లు 10 నెలల కాలంలో 14 సిఈసి తీసుకున్న నిర్ణయాలపై తమ అభ్యన్తరాలు చెప్పిన వినకుండా తన సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు ఒక జాతీయ పత్రికలో వార్త వచ్చినదాకా ఎవరికి తెలియని పరిస్థితి అంటూ దుయ్యాబట్టారు . ప్రజల ప్రాధమిక హక్కును దొంగిలించిన సిఈసి ని విధులనుండి తొలిగించాలి .. అదేవిధంగా అతనిపై సమగ్ర విచారణ జరిపించాలి ,, కుంభ కోణానికి కారణమైన సర్ ను నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు . అనంతరం కాంగ్రెస్ పార్టి ఇంచార్జి చుక్క చంద్రపాల్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఎన్నికల తతంగం మొదలైన దగ్గర నుండి ఎన్నికల అనంతరం వరకు తమ పార్టి అధినేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తూనే వున్నారు పార్లమెంటు సమావేశల్లో కూడ పాలకులను ప్రశ్నలతో విమర్శలు చేశారు అన్నారు . జ్ఞానేష్ కుమార్ ను బీజేపీ తమ చెప్పుచేతల్లో పెట్టుకొని ఎక్కడ తాము ఓడిపోతామో తెలుసుకొని అక్కడ ఓట్లను తొలిగించటం ,అప్రజాస్వామ్యక విధానలతో అధికారంలోకి వచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు . ఇప్పటికైనా బీజేపీ తన బంటు అయిన జ్ఞానేష్ కుమార్ ను తొలిగించెకపోతే ప్రజా ఉద్యమాల ప్రవాహంలో బీజేపీ కొట్టుకపోతుంది అంటూ ఆయన జోస్యం చెప్పారు . అనంతరం మరి కొందరు నాయకులు సి ఈ సి , బీజేపీ కుట్రల పై తమదైన శైలిలో విమర్శలు చేశారు .. ముందుగా నిరసన ర్యాలీ స్థానిక సీపిఎం కార్యాలయం నుండి ప్రారంభం అయి స్థానిక తాలూకా సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .


అనంతరం ర్యాలీ ప్రధాన రహదారి వెంట గడియార స్తభం నుండి సూర్య టాకీస్ దగ్గర ఉన్న జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు చేసిన నిరసన శిబిరనికి చేరుకుంది .. అక్కడ జాతీయ నాయకుల విగ్రహాలక నివాళులు అర్పించారు .. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి ఇంచార్జి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మండల సీపిఎం పార్టి కార్యదర్శి పెండ్యాలా మహేష్ ,, ముప్పాళ్ళ మండల సీపిఎం పార్టి నాయకులు జి బాలకృష్ణ , కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు మాదంశెట్టి వేదాద్రి, పట్టణ అధ్యక్షులు దాసరి జ్ఞాన్ రాజ్ పాల్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి నాయకులు సందేపోగు గాంధీ ఐద్వా సంఘ నాయకురాలు గద్దె ఉమశ్రీ రాష్ట్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కట్టా శివ దుర్గారావు , అనుముల విరబ్రహ్మం చేనేత కార్మికుల పల్నాడు జిల్లా కార్యదర్శి , పొట్టి సూర్యప్రకాశారావు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనర్ , గుంటుపల్లి రజని ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శ హరిపోతురద్కర్ తదితరులు పాల్గొన్నారు .

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్