ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్ట్రాంగ్ రూములు 24 గంటలూ బందోబస్తు : జెసి

1 రోజు క్రితం

స్ట్రాంగ్ రూములు 24 గంటలూ బందోబస్తు : జెసి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

స్ట్రాంగ్ రూములు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా శ్రీహర్ష ఆదేశించారు. జెడ్‌‌పిటిసి ఎన్నికల్లో భాగంగా సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌ ‌పరిధిలోని 9 మండలాలకు ధూళిపాళ్ల లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమును, రిసెప్షన్‌, కౌంటింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేయగా శుక్రవారం జెసి తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, తాగునీరు, విద్యుత్, సౌకర్యాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూములకు 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా తావివ్వొద్దని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.గోపాలకృష్ణ, డిఎస్పీ కృష్ణచైతన్య, తహశీల్ధార్లు, ఎంపిడిఒలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్