ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పల్నాడులో తొలిసారిగా గర్భస్థ శిశువుకు రక్త మార్పిడి చికిత్స ...

1 రోజు క్రితం

పల్నాడులో తొలిసారిగా గర్భస్థ శిశువుకు రక్త మార్పిడి చికిత్స ...
24 వారాల శిశువుకు గర్భంలోనే అరుదైన వైద్య ప్రక్రియ.. తల్లీబిడ్డ క్షేమం... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లాలో తొలిసారిగా గర్భస్థ శిశువుకు గర్భం లోనే రక్త మార్పిడి చికిత్స (ఇంట్రాయూటరైన్ ట్రాన్స్‌ఫ్యూజన్‌-ఐయూటీ) నిర్వహించారు. నరసరావుపేట పట్టణం అరండల్ పేటలోని డాక్టర్ అర్పితాస్ ఫీటల్ మెడిసిన్ సెంటర్‌ లో ప్రముఖ ఫీటల్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ పాలడుగు అర్పిత (యరమల) 24 వారాల గర్భస్థ శిశువుకు ఈ అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆర్ హెచ్ ఐసోఇమ్యునైజేషన్ కారణంగా తీవ్ర రక్త హీనతతో పాటు హైడ్రాప్స్ ఫీటాలిస్ అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న శిశువుకు ఈ చికిత్స అవసరమైంది. గర్భం లోనే శిశువుకు రక్తాన్ని అందించడం ద్వారా రక్త హీనత తీవ్రతను తగ్గించే లక్ష్యంతో వైద్య ప్రక్రియ చేపట్టారు. ఈ చికిత్సలో డాక్టర్ దివ్య భారతి సొంగా, ఇతర వైద్య సిబ్బంది సహకరించారు. చికిత్స అనంతరం తల్లి, గర్భస్థ శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్య బృందం వెల్లడించింది. అత్యంత నైపుణ్యం, ప్రత్యేక వైద్య పరిజ్ఞానం అవసరమయ్యే ఈ ప్రక్రియను జిల్లాలో తొలిసారిగా నిర్వహించడం తమకు గర్వకారణమని డాక్టర్ అర్పిత అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్