ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకృతి వ్యవసాయంతో వాతావరణం ప్రతికూలతను అధిగమించవచ్చు

09 నవంబర్, 2026

ప్రకృతి వ్యవసాయంతో వాతావరణం ప్రతికూలతను అధిగమించవచ్చు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 06:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి నాదెండ్ల

ప్రకృతి వ్యవసాయంతో వాతావరణ ప్రతికూలతలను అధిగమించవచ్చు

ప్రతి రైతూ అంతర పంటల విధానాన్ని అమలు చేయాలి

కె. అమల కుమారి, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్

చిరుమామిళ్ల (నాదెండ్ల), నవంబరు వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించాలని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె. అమల కుమారి పిలుపునిచ్చారు. ప్రతి రైతూ అంతర పంటల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

నాదెండ్ల మండలం చిరుమామిళ్ల రైతు సేవా కేంద్రంలో సోమవారం పూర్వాభ్యాస శిక్షణ కార్యక్రమం, ఖేతి బచావో అభియాన్‌లో భాగంగా సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కె. అమల కుమారి మాట్లాడుతూ విత్తనాలను సీడ్ పెల్లెట్స్‌గా తయారు చేసి, సుమారు 400 కిలోల ఘనజీవామృతంతో కలిపి పొలంలో విత్తుకోవాలని సూచించారు. పంటల మధ్య అంతర పంటలు సాగు చేయడం వల్ల భూమి నిరంతరం పచ్చదనంతో కప్పబడి ఉంటుందని, నేలలో సేంద్రియ కర్బనం పెరిగి తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుందని వివరించారు. అంతర పంటల వల్ల ప్రధాన పంటకు రక్షణ కలగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. చీడపీడల నివారణకు దశపర్ణి కషాయం వంటి ప్రకృతి వ్యవసాయ కషాయాలను వినియోగించాలని సూచించారు.

ఏరువాక కేంద్రం పల్నాడు జిల్లా కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. నాగేశ్ మాట్లాడుతూ ముఖ్యమైన పంటల్లో సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులు, వాటి అమలు విధానాలను వివరించారు.

జిల్లా శిక్షణా కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు కె. అమల కుమారి మాట్లాడుతూ పచ్చిరొట్ట పైర్ల సాగు, పంట అవశేషాలను కాల్చకుండా పొలంలోనే కుళ్లబెట్టడం ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు.

జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి ఎం. అరుణ మాట్లాడుతూ జీవన ఎరువులు, జీవ శిలీంధ్రనాశినుల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. పూత దశ, గింజ లేదా కాయ అభివృద్ధి దశల్లో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు పంట అవసరాన్ని బట్టి 13:0:45 వంటి పోషకాలను పైపాటుగా అందించాలని సూచించారు.

రైతులకు అవసరమైన ఘనజీవామృతం, బీజామృతం, వివిధ రకాల కషాయాలు, గ్రోత్ ప్రమోటర్లు, లింగాకర్షక పరికరాలు, పసుపు, తెలుపు, నీలిరంగు అట్టలు తదితర ప్రకృతి వ్యవసాయ ఉత్పాదకాలు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనరుల కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని అమల కుమారి తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకుని తక్కువ పెట్టుబడితో అధిక నికర ఆదాయం పొందాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా సిబ్బంది సౌజన్యలక్ష్మి, మండల మాస్టర్ ట్రైనర్ సాగి శ్రీనివాసరావు, APCNF సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్