ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల్లో దౌర్జన్యాలపై రేపు నిరసనలు

09 నవంబర్, 2026

ఎన్నికల్లో దౌర్జన్యాలపై రేపు నిరసనలు
జయప్రదం చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌‌కుమార్‌ పిలుపు
నూతన పాలకవర్గాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలని విజ్ఞప్తి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 08:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

జయప్రదం చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌‌కుమార్‌ పిలుపు

నూతన పాలకవర్గాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలని విజ్ఞప్తి


ఎన్నికలలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడడం దుర్మార్గమని, నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం జరిగే ధర్నాలను, నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక పుతుంబాక భవన్లో జరిగిన సిపిఎం సత్తెనపల్లి పట్టణ కమిటీ సమావేశానికి ఎ.వీరబ్రహ్మం అధ్యక్షత వహించగా విజయ్ కుమార్ మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణం, రూరల్ మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినప్పటికీ ప్రజలను ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. క్రోసూరు, ముప్పాళ్ళ, నకరికల్లు మండలాల్లో అధికార పార్టీకి చెందినవారు నామినేషన్లు వేయనీయకపోవడం, నామినేషన్ పత్రాలను చించి వేయడం, ఏజెంట్లను బయటకు పంపించడం ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి అధికార దుర్వినియోగానికి పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన వారు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు చూసి కూడా స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఈ దుర్మార్గాలకు దౌర్జన్యాలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం జరిగే ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సత్తెనపల్లి పట్టణంలో సిపిఎం కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేయాలని అన్నారు. మురసు తుఫాన్ ప్రభావంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలో పేరుకుపోయి ఉన్న పారిశుధ్య సమస్యలు, డ్రెయినేజి వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని, వార్డులలో పార్కింగ్ చేయించడం, బ్లీచింగ్ వేయించడం వంటి సమస్యలపై పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి, ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం కౌన్సిల్లో తీర్మానాలు చేయించాలని కోరారు. పెరుగుతున్న పట్టణ జనాభా కనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు కె.శివదుర్గారావు, పి.సూర్య ప్రకాశరావు, పి.ప్రభాకర్‌రావు, షేక్ మస్తాన్‌‌వలి, ఎం.హరిపోతురాజు, జె.రాజ్‌‌కుమార్‌, జి.ఉమశ్రీ, ఎం.జ్యోతి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్