ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రకృతి వ్యవసాయం అనుకూలం

13 నవంబర్, 2026

ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రకృతి వ్యవసాయం అనుకూలం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పెదకూరపాడు

ప్రతికూల వాతావరణంలో కూడా ప్రకృతి వ్యవసాయం అనుకూలంగా ఉంటుందని పల్నాడు జిల్లా డిపిఎం అమల కుమారి తెలిపారు. శుక్రవారం స్థానిక రైతు కేంద్రంలో రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను పొందవచ్చును అన్నారు. ఆదాయం కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పద్ధతులు పాటించాలని కోరారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సత్య గోపాల్ మాట్లాడుతూ అధిక రసాయనాలు వాడటం వల్ల నష్టాలు అధికంగా ఉంటాయన్నారు. ప్రత్తి , మిరప, మొక్కజొన్న, మినుము, శనగలు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేశారు. అనంతరం మిరపలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న రాష్ట్ర అభ్యుదయ రైతు శేషారావు పొలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి డి కృష్ణయ్య, వ్యవసాయ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్