ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నామినేషన్‌ కేంద్రం వద్ద ప్రతి ఘటనా రికార్డవ్వాలి- కర్లకుంటలో పల్నాడు ఎఎస్‌‌పి పరిశీలన

6 రోజుల క్రితం

నామినేషన్‌ కేంద్రం వద్ద ప్రతి ఘటనా రికార్డవ్వాలి
కర్లకుంటలో పల్నాడు ఎఎస్‌‌పి పరిశీలన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 06:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులను పల్నాడు పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి చెప్పారు. రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అప్రమత్తంగా వ్యవహరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అభ్యర్థులు, ప్రతిపాదకులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో డ్రోన్, సిసి కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బాడీ వార్న్ కెమెరాలు ధరించాలని, ప్రతి ఘటన రికార్డయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో అనధికార వ్యక్తులు, వాహనాలు, గుంపులు ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించాలని సూచించారు. గ్రామాల్లో మొబైల్ పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేవారు, గొడవలకు ప్రేరేపించేవారు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్