ప్రత్యేక బస్సు సర్వీ సులు.. డిపో మేనేజర్ యద్దన పూడి వేణుబాబు...
ప్రజాశక్తి-చిలకలూరిపేట
కార్తీక మాసాన్ని పురస్కరించు కొని భక్తుల సౌకర్యార్థం చిలక లూరిపేట ఆర్టీసీ డిపో ఆధ్వర్యం లో ప్రత్యేక క్షేత్ర దర్శన యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ యద్దనపూడి వేణుబాబు తెలిపారు. స్థానిక ఆర్.టి.సి డిపోలో తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులు ఒకే ప్రయాణంలో పలు పుణ్య క్షే త్రాలను దర్శించుకునేలా ప్రత్యేక తఙహింపు రేట్లతో బస్సు ప్యాకే జీలను రూపొందించినట్లు పేర్కొ న్నారు.ఈ నెల 22వ తరీఖు నుం చి ప్రత్యేక యాత్రలు ప్రారంభమ వుతాయని, చిలకలూరిపేట బ స్టాండ్ నుంచి రాత్రి 10 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు బయలు దేరుతాయన్నారు. సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవ రం, అమరావతి తదితర పుణ్య క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక ఏర్పా ట్లు చేసినట్లు వివరించారు. ఒక్కొక్క భక్తుడికి పంచారామా లు దర్శించుటకు రూ.1,350 టికెట్ ధర నిర్ణయించగా, అదే విధంగా ప్రత్యేక గిరి ప్రదక్షిణ యా త్రకు రూ.2,500 టికెట్ ధర ఉం దన్నారు. కార్తీక మాసంలో భక్తు లు కుటుంబ సమేతంగా పుణ్యక్షే త్రాలను దర్శించుకునేందుకు ఈ ప్రత్యేక బస్సు సేవలను తక్కువ రేట్లకు పూర్తి సౌకర్యాలతో ఏర్ప టు చేసి ఈ యాత్రను పట్టణ ప్రజలు వినియోగించుకోవాలన్నా రు. మిగిలిన వివరాలు, టికెట్ల బుకింగ్ కోసం చిలకలూరిపేట ఆర్టీసీ డిపోను సంప్రదించాలని డిపో మేనేజర్ యద్దనపూడి వేణుబాబు సూచించారు. ఇతర వివరాల కోసం 9959225427/7382892130 ఫోన్ నంబర్లకు సంప్రదించా లన్నారు......







కామెంట్లు (0)