రాజకీయాలు, పార్టీలకు అతీతంగా గ్రామాల్ని అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని, కూటమి పార్టీల ఐక్యతే రాష్ట్రానికి నిజమైన బలమని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
గురువారం ఆయన నియోజకవర్గంలోని నాదెండ్ల ఎంపీపీ గంగా శ్రీనివాసరావు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాదెండ్ల ఎంపిపి గంగా శ్రీనివాసరావు, కార్యక్రమానికి హాజరై కూటమిశ్రేణుల్ని, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
కూటమి పార్టీలు ప్రజలతో ఉన్నంతకాలం.. ప్రతిపక్ష డ్రామా పార్టీలు, ఆ పార్టీ నాయకులు రీల్స్ కే పరిమితమై, సోషల్ మీడియాలోనే నాయకులుగా చలామణి అవుతారని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందని, చంద్రబాబు నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఇప్పటికే ప్రజలకు అర్థమైందని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా , భవిష్యత్ లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి తెలిపారు. టీడీపీ అనుబంధ విభాగాలు ఐక్యంగా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారని, వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని 51 ఎంపీటీసీలు కూటమి కైవశం కావడమనేది నిజంగా ప్రజల ఆశీర్వాదం, అభిమానం వల్లనే సాధ్యమైందన్నారు. నాదెండ్ల మండలంలోని 20 ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసిన టీడీపీ శ్రేణులకు, మండల నాయకులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. పంచాయతీ ఎన్నికలతో స్థానిక సమరం పూర్తవుతుందని, తర్వాత ప్రజలందరూ ఒకేమాటపై ఉండి తమ ఊళ్లను అభివృద్ధి చేసుకోవాలని ప్రత్తిపాటి హితవు పలికారు. గత ప్రభుత్వంలో కూటమి శ్రేణులు ఎదుర్కొన్న అవమానాలు, బెదిరింపులు, వేధింపులు ఎన్నో ఉన్నాయని, వాటన్నింటికీ తాజా విజయాలు తిరుగులేని సమాధానం చెప్పాయని ప్రత్తిపాటి తెలిపారు.
కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజరమేష్, నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు కుర్రా రత్తయ్య, నల్లమోతు హరిబాబు, ముత్తవరపు సురేష్ బాబు, మూడు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీ లు, కూటమి నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)