ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులతో చైల్డ్ న్యూట్రి గార్డెన్

14 నవంబర్, 2026

school.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – గరుగుబిల్లి: విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో శనివారం చైల్డ్ న్యూట్రి గార్డెన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెట్ జీరో క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను నాటారు.

విద్యార్థులే మొక్కలను పెంచి, సంరక్షించడం ద్వారా ప్రకృతి వనరుల విలువతోపాటు పోషకాహారం ప్రాధాన్యతను తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గురుకులాల కార్యదర్శి ఐఏఎస్ అధికారి తేజ్ చంద్ర ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 190 విద్యాసంస్థల్లో పర్యావరణహిత క్యాంపస్‌ల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. రజనీకుమారి, నోడల్ అధికారి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్