మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనావాసాల్లోకి ఏనుగులు

1 గంట క్రితం

సాలూరు మండలం వైపు వెళ్లినట్టే వెళ్లిన ఏనుగులు తిరిగి  మార్కొండ పొట్టి సరాయివలస శాంతి స్వరం డబ్భులు వలస మీదుగా మండలంలోకి ప్రవేశించాయి.

సాలూరు మండలం వైపు వెళ్లినట్టే వెళ్లిన ఏనుగులు తిరిగి మార్కొండ పొట్టి సరాయివలస శాంతి స్వరం డబ్భులు వలస మీదుగా మండలంలోకి ప్రవేశించాయి.

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 09:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి మక్కువ :

అరణ్యంలో ఉండాల్సిన ఏనుగులు జనావాసాలకు సమీపంలోకి రావడంతో వాటిని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. సాలూరు మండలం వైపు వెళ్లినట్టే వెళ్లిన ఏనుగులు తిరిగి మార్కొండ పొట్టి సరాయివలస శాంతి స్వరం డబ్భులు వలస మీదుగా మండలంలోకి ప్రవేశించాయి. మంగళవారం ఉదయం ఏనుగుల గుంపు మండల కేంద్రం మక్కువ సువర్ణముఖి నది ఒడ్డున ఉన్న చర్చి సమీపంలోని నీటి బందలో ఉన్నాయి అని తెలిసిన ప్రజలు వాటిని చూసేందుకు ఎగబడ్డారు. దీనితో ఏనుగు ట్రాకర్లు ప్రజలను ఏనుగుల వద్దకు రావద్దని, ఏ విధమైన కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. రెండు ప్రధాన రహదారుల మధ్య ఏనుగులు సంచరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్